తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ రాజీవ్ చౌక్ వద్ద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం (మహాలక్ష్మి) కార్యక్రమాన్ని , నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రి ఆవరణలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు కార్యక్రమాన్ని నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో..
సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి కొత్త బస్టాండ్ ఆవరణలో డిప్యూటీ రీజినల్ మేనేజర్, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి, నిర్మలా జయప్రకాష్ రెడ్డి,ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రారంభించారు.
జహీరాబాద్ లో...
జహీరాబాద్ నియోజకవర్గ స్థాయిలో జహీరాబాద్ బస్టాండ్ ఆవరణలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంపు, మహాలక్ష్మి పథకాలను జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు,మహిళలు పాల్గొన్నారు.
.