ప్రజలకు సేవకుడిగా సేవలందిస్తా

తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఒక సేవకుడిగా సేవలందిస్తానని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మపురి శాసనసభ్యులు గెలుపొంది ప్రమాణ స్వీకారం అనంతరం నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు ధర్మపురి నియోజకవర్గ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ధరంపురి నియోజకవర్గంలోని పలు మండలాలను కలుపుతూ ఆదివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తానని ప్రతి ఒక్కరు సమస్య ఉంటే నేరుగా తనను సంప్రదించాలని ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందిస్తారని తెలిపారు. ప్రతి సమస్యను పరిష్కారం చేయడంలో ముందుండి కృషి చేస్తానాని ధర్మపురిని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానాని తెలిపారు. అనంతరం పట్టణంలోని పటేల్ గార్డెన్ లో కార్యకర్తల తో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేముల రాజేష్, కౌన్సిలర్లు వేముల నాగలక్ష్మి, జక్కు పద్మ, గరిగే అరుణ,వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు.

.