ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు కార్యక్రమాన్ని,  మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం (మహాలక్ష్మి) కార్యక్రమాన్ని శాసనసభ్యులు  

గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 5 లక్షల రూపాయల పరిమితి నుండి 10 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, మహాలక్ష్మి పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

.