వన భోజనాలతో ఐక్యత.. స్నేహభావం

వీరశైవ లింగాయత్ భవన నిర్మాణానికి కృషి చేస్తా 

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్  

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): సంగారెడ్డి జిల్లా కలబగూర్ మంజీరా డ్యామ్ శివాలయ ఆవరణలో వీరశైవ లింగాయత్ అధ్వర్యంలో ఆదివారం వన భోజనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్  మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో వీరశైవ లింగాయత్ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ నాకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మీకు అందుబాటులో ఉంటూ మీకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ భవన నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తానని హామీనిచ్చారు.  

దామాషా ప్రకారం మనకు కావలసిన వాట రావడానికి నా పూర్తి సహకారం ఉంటుందన్నారు. కార్తీక మాస వన భోజనం కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరప్ప, జిల్లా కార్యదర్శి మల్లిఖార్జున్ పటేల్, శివ కుమార్, రాజు, ధనుంజయ్, రాజేశ్వర్ స్వామి, సీడిసి చైర్మన్ కసాల బుచ్చిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, కొత్తపల్లి శ్రీకాంత్, శ్రావణ్ రెడ్డి, చక్రపాణి, వాజీద్, వీరశైవ లింగాయత్ సభ్యులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

.