తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపూర్ (దమ్మనిపల్లే)గ్రామంలో పాడిరైతు దమ్మని నర్శింహులు-మంజుల కూతురు దీప వివాహనికి కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో పుస్తేమట్టెలు అందజేసిన ఇల్లంతకుంట రూట్ సూపర్వైజర్ గుర్రం సతీష్ రెడ్డి అందజేశారు.ఈసందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ డెయిరీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అందులో భాగంగా కళ్యాణమస్తు పథకంలో భాగంగా ఆడబిడ్డ పెళ్ళికి పుస్తేమట్టెలు అందజేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నర్శింహులు కార్యదర్శి బెజ్జంకి బాబు తదితరులు పాల్గొన్నారు.
