మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): భారత దేశం ప్రజాస్వామ్య దేశం, ప్రజలే ప్రభుత్వాలను ఏర్పాటు చేసే విధానంలో ఓటు హక్కు విలువైనదని, ఓటుతో దేశాన్ని, భవిష్యత్తును మార్చుకోవాలని, ఓటు హక్కు ప్రజలందరికీ సమానంగా ఉంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. నూతనంగా 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు తప్పని సరిగా ఓటు నమోదు చేసుకోవాలనీ, భవిష్యత్తును మార్చుకోవాలని తెలిపారు. ఫోరమ్ 6 ద్వారా నమోదు చేసుకున్న వారి ఓటును బిఎల్ఓలు, బిఎల్ఓ సూపర్ వైజర్ల ద్వారా ఆన్లైన్ ప్రక్రియ వేగవంతం చేయించాలని తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 01 జనవరి 2024 నాటికీ 18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులు నూతన ఓటరుగా ఫారం 6 ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. 06 జనవరి, 2024న ముసాయిదా జాబితా ప్రకటన 08 ప్రిబ్రవరి, 2024న, తుది ఓటరు జాబితా ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు .
18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఆన్లైన్ ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేలా ,అవగాహన కలిగిస్తూ అధికారులు ప్రోత్సహించాలని కోరారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం బూతు లెవల్ అధికారులకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. గ్రామాల వారీగా ఫామ్ 6, ను త్వరిత గతిన ఆన్లైన్ పక్రియ పూర్తి చేయాలని BLO, BLO ల సూపర్వైజర్ ద్వారా సమాచారం తెలుసుకోవాలన్నారు.
త్వరలో స్థానిక సంస్థలకు జరగబోయే ఎన్నికల దృష్ట్యా నూతనంగా ఓటరు నమోదుపై విస్తృత అవగాహన కలిగి ఉండాలన్నారు.
.