తెలంగాణ దేవత సోనియా

మెదక్ కాంగ్రెస్ నేతలు హఫీజొద్దీన్, కొండన్ సురేందర్ గౌడ్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజొద్దీన్, సీనియర్ నేతలు కొండన్ సురేందర్ గౌడ్, చల్లా నరేందర్ కొనియాడారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోనియా జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకూ సోనియా పేరు నిలిచి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి సోనియా జనం గుండెల్లో నిలిచిపోయారన్నారు. దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారాన్ని అప్పజెప్పిన తెలంగాణ ప్రజలు సోనియా రుణం తీర్చుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు అవారి శేఖర్, లింగం, మ్యాకల రవి, సమియుల్ల ఖాన్, మహ్మద్ మున్నా, దొంతి నరేశ్, అశోక్ రెడ్డి, ముజీబ్, జీవన్ రావ్, బొజ్జ పవన్, నాగిరెడ్డి, గూడూరి ఆంజనేయులు, నర్సింలు, ఇస్మాయిల్, శేఖర్, సంజీవులు, పోచేందర్ తదితరులు పాల్గొన్నారు.

.