అంగరంగ వైభవంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రవేశం

మెదక్ లో క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం రోజు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దంపతులు ప్రవేశం చేశారు. ఉదయం 8:30 గంటల నుండి  పూజా కార్యక్రమాలు, హోమం నిర్వహించిన అనంతరం క్యాంప్ కార్యాలయంలో మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తండ్రి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దంపతులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావుకు శుభాకాంక్షలు తెలపడానికి మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రమేష్, మెదక్ డి.ఎస్.పి ఫణిందర్, మెదక్ ఆర్డిఓ అంబదాస్ రాజేశ్వరరావు, మెదక్ తహసిల్దార్ శ్రీనివాస్, విద్యుత్ శాఖ అధికారులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి  ఎమ్మెల్యేకు శాలువా,  పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మెదక్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఎంతో రుణపడి ఉంటానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తన శాయశక్తుల కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

.