ఈసీఐకి సాధారణ ఎన్నికల వివరాలు అందజేత

18 ఏళ్లు నిండిన యువతీ,  యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): సాధారణ ఎన్నికలు 2023 , ఎన్నికల అనంతరం ECI రాష్ట్ర వ్యాప్తంగా  గురువారం  నిర్వహించిన  వీడియో  కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లుతో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల, ఎన్నికల సరళి, స్క్రూటినీ, ఓటింగ్, ఫలితాల సరళి వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్కు మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలియజేశారు. 

అనంతరం మెదక్, నర్సాపూర్  ఆర్డిఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫోరమ్ 6   ద్వారా నమోదు చేసుకున్న  వారి ఓటును బిఎల్ఓలు, బిఎల్ఓ సూపర్ వైజర్ లు ద్వారా ఆన్లైన్ ప్రక్రియ వేగవంతం చేయించాలని  అధికారులను ఆదేశించారు.  ఆబ్సెంట్ ఓటర్లు, చిరునామా మార్పు చేసుకునే ఓటర్లు , డెత్  ఓటర్ల వివరాలు  (ASD ) నమోదు చేయాలనీ సూచించారు. డబుల్ ఓటర్ల  నమోదులు తీసివేయాలని  ఆదేశించారు.  

భారత ఎన్నికల సంఘం   ఆదేశాల మేరకు   01 జనవరి, 2024 నాటికీ 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు నూతన  ఓటరుగా ఫారం 6 ద్వారా  నమోదు చేసుకోవాలని సూచించారు.  06 ,జనవరి, 2024న ముసాయిదా జాబితా ప్రకటన, 08 ప్రిబ్రవరి, 2024న, తుది ఓటరుజాబితా ప్రకటించడం జరుగుతుందని  పేర్కొన్నారు. ఇండెక్స్ కార్డ్  సరైన నమూనాలో తయారు చేయాలన్నారు.

18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఆన్లైన్ ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కలిగిస్తూ ప్రోత్సహించాలని కోరారు. ఓటరు జాబితాలో  మార్పులు, చేర్పుల కోసం బూతులెవల్  అధికారులకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. గ్రామాల వారీగా ఫామ్ 6,  ను త్వరిత గతిన ఆన్లైన్ పక్రియ పూర్తి చేయాలని BLO, BLO ల సూపర్వైజర్ లకు ఆదేశించాలని అధికారులను ఆదేశించారు.  త్వరలో స్థానిక సంస్థలకు జరగబోయే ఎన్నికల దృష్ట్యా నూతనంగా ఓటరునమోదు పై విస్తృత అవగాహన కల్పించాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు, మెదక్ ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్, నర్సాపూర్ ఆర్డీఓ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

.