పూజా కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన మైనంపల్లి రోహిత్ రావ్ శుక్రవారం నాడు మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రవేశం చేయనున్నారు. ఉదయం 8.16 ని.లకు గోపూజ, ప్రవేశము, 8.45 గంటలకు గణపతి పూజ, స్వస్తి వాచనము, వాస్తుమండల, నవ్రగహ, దిక్పాలక పూజలు, 9.45 గంటలకు శ్రీ లలితా త్రిపుర సుందరీ మాతకు పంచామృతాభిషేకము, కుంకుమార్చన, పుష్పార్చనలు, 10.30 గంటలకు స్థాపిత దేవతా హవనములు, బలిప్రదానము, పూర్ణాహుతి, మహాదాశీర్వచనము నిర్వహించనున్నారు. 11.00 గంటల నుండి 11.30 వరకు ముస్లీం, క్రిస్టీయన్ ల మత పెద్దలచే ప్రార్థన, 1.30 నుండి 2.30 వరకు భోజనాలు, 2.30 నుండి సా. 6.00 వరకు కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దంపతులతో పాటు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.
.