కాంగ్రెస్ నాయకుల సంబరాలు....

తెలంగాణ ప్రభ(ధర్మపురి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడు అనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన  సందర్భంగా ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం సంబరాలు జరిపారు. స్థానిక నంది చౌక వద్ద  పెద్ద ఎత్తున టపాసులు పేల్చి మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణలో నియంతృత్వ పాలన అంతమైందని ప్రజా తెలంగాణ పాలన వచ్చిందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు సింహరాజు ప్రసాద్, రందేని మొగిలి,స్తంభంకాడి గణేష్, రఫీ,చీపిరిశెట్టి రాజేష్ సుముఖ్, బొంగురాల వాసు, కాశేట్టి రాము, భారతపు వెంకటేష్, అప్పం తిరుపతి, గాజు సాగర్,తదితరులు పాల్గొన్నారు.

.