సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): తెలంగాణ ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి, ఆయన మంత్రివర్గ సహచరులకు మాజీ మంత్రి, బీఆరెస్ నేత టి.హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలంటూ హరీశ్‌రావు ట్వీట్‌లో పేర్కోన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు పిదప బీఆరెస్ వైపు నుంచి అభినందనలు తెలిపిన తొలి నేత హరీశ్‌రావు కావడం గమనార్హం.

.