ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలను తంగళ్ళపల్లి మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెద్దూరి తిరుపతి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తదనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గజబింకర్ రాజన్న, వార్డ్ సభ్యులు క్యారం జగత్, రెడ్డి పరశురాములు, మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి హమీద్ మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

.