విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి...

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ 

తెలంగాణ ప్రభ,(కోనరావుపేట);విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని,క్రీడలతోనే మానసిక ఉల్లాసం లభిస్తుందని జడ్పీచైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు.బుధవారం  కోనరావుపేట మండలం మరిమడ్ల లోని ఏకలవ్య గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ లో  తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2వ రాష్ట్ర స్థాయి గేమ్స్అండ్ స్పోర్ట్స్ మీట్  లో   జడ్పీచైర్ పర్సన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ..... విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు.క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడల ద్వారా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటామని అన్నారు. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో, ఆటలు కూడా అంతే ముఖ్యమని గుర్తుచేశారు. ప్రతీ ఆటలో పట్టుదలతో కృషి చేస్తే విజయం సొంతమవుతుందని, విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో  ఎంపీపీ చంద్రయ్య గౌడ్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ బండ నర్సయ్య యాదవ్, సర్పంచ్ అశోక్, ఎంపీటీసీ రేణుక,ఆర్సీఓ వెంకన్న, ప్రిన్సిపల్ భాస్కర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

.