తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో) : మెదక్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఎస్సి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అంబేద్కర్ చిత్రపటానికి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డి ఆర్ ఓ పద్మశ్రీ, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంటరానితనం రూపుమాపడానికి కృషి చేశారని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి పౌరుడు కృషి చేయాలని సూచించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని తెలిపారు.
కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ, యునుస్, బలరాం, IDOC సిబ్బంది పాల్గొన్నారు.
.