జాతీయస్థాయి కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

బ్లాక్ బెల్టులు సాధించిన 7 మంది విద్యార్థులు

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మెదక్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. బుధవారం మూన్ బుడోకాన్ కరాటే అకాడమి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో జరిగిన ఈ పోటీల్లో పట్టణానికి చెందిన వరప్రసాద్, మధువరుణ్, సాయివారేణ్య, చంద్రశేఖర్, విజయప్రసాద్, యాదగిరి, గణేష్ కుమార్ బ్లాక్ బెల్టులు సాధించారు. వీరు గత పన్నెండుళ్లుగా నిత్యం శిక్షణ పొందుతున్నారు. ఇక నుంచి జాతీయ స్థాయిలో నిర్వహించే బ్లాక్ బెల్టు పోటీల్లో పాల్గొంటారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్, మూనో బుడోకాన్ కరాటే గ్రౌండ్ మాస్టర్ కరాటే శేఖర్ పతకాలు, బెల్లులు ప్రధానం చేసి మాట్లాడారు. కరాటే అందరూ. నేర్చుకోవాలని సూచించారు. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందన్నారు. తమను తాము రక్షించకోవడంలో కరాటే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎగ్జామినర్లుగా యాదగిరి, కిష్టయ్య, బీరప్ప, సుభాష్ తదితరులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కార్యదర్శి రాజ్కుమార్, ఉపాధ్యక్షులు ఫజులొద్దిన్, యూనిట్ అధ్యక్షులు శివాజీ తదితరులు పాల్గొన్నారు.

.