తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రోజున ప్రతి నెల సంస్థ సేవా కార్యక్రమాలలో భాగంగా డిసెంబర్ నెలకు సంబందించి.. ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్న మూడు కుటుంబాలకి ఒక్కొక్కోరికి సుమారు రెండు వేల రూపాయల విలువ కలిగిన సుమారు ఇరవై ఐదు రకాల వస్తువులతో కూడిన నిత్యావసర కిరాణా సామాగ్రిని ధర్మపురి మునిసిపల్ పరిధిలో గల హనుమాన్ వాడ, బోయ వాడ, కమలాపూర్ చౌరస్తా వద్ద నివాసం ఉంటున్న.. కట్ట తిరుపతి, కలమడుగు లచ్చన్న, బడుగు రాజమ్మ, ఆర్థికంగా వెనుకబడి ఉండి ఆర్థిక ఇబ్బందులతో, కష్టంగా ఉన్న పరిస్థితులలో ఈ నాలుగు కుటుంబాలకు నిత్యావసర వస్తువులను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అండగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో సభ్యులు జక్కు రవీందర్, కోరిడే శంకర్ శర్మ, రంగు లక్ష్మీ నరహరి, పప్పుల శ్రీనివాస్, రంగ హరినాథ్, స్తంభం కాడి జగదీష్, చాడ శ్రీనివాస్, బలిపెల్లి సంతోష్, మాధవి, రమాదేవి లతో పాటు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
.