ఘనంగా అంబెడ్కర్ వర్ధంతి....

తెలంగాణ ప్రభ(ధర్మపురి):ధర్మపురి పట్టణంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ధర్మపురి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి  మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ,ఎంపీడీఓ ప్రవీణ్,మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ  ఫ్లోర్ లీడర్ వేముల నాగలక్ష్మి, కౌన్సిలర్లు జక్కు పద్మ,అరుణ,నాయకులు జక్కు రవీందర్, సింహారాజు ప్రసాద్,చిలుముల లక్ష్మణ్, అసెట్టి శ్రీనివాస్, రందేని మోగిలి, చిపిరిశెట్టి రాజేశ్,అప్పం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

.