తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి సంగారెడ్డి తాజా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రాజీనామా చేశారు.
ఈ మేరకు తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు.
28 సెప్టెంబర్ 2022న చింతా ప్రభాకర్ బాధ్యతలు చేపట్టారు. 14 నెలల 7రోజుల పాటు చింతా ప్రభాకర్ పదవిలో కొనసాగారు. తాజాగా సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా చింతా ప్రభాకర్ గెలిచిన విషయం తెలిసిందే.
.