తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లి సమీపంలో ఓ కారు ప్రమావశాత్తు బోల్తా పడింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులకు కారులో రెండు క్వింటాళ్ల గంజాయి పొట్లాలను చూసి అవాక్కయ్యారు.
భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ముంబయికి గంజాయి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన స్మగ్లర్లు కారును, గంజాయిని అక్కడే వదిలేసి పరారైనట్లు వివరించారు. వీటిని స్వాధీనం చేసుకొని చిరాగ్‌పల్లి ఠాణాకు తరలించామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
.