ఓటు హక్కు వినియోగించుకున్న మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): సాధారణ ఎన్నికలు 2023 లో, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా  తన ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.

హవేలీ ఘనపూర్ మండలం లో ఔరంగబాద్ తాండా ప్రాథమిక పాఠశాల లో, ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రo నంబర్ 211 లో ,సాధారణ పౌరుడిగా, క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నరు. అనంతరం ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, మెతుకు సీమ ను 100 శాతం ఓటింగ్ లక్ష్యంతో, మహిళలు,యువత,ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా లో స్వీప్ అధ్వర్యంలో అనేక ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, సైకిల్ ర్యాలీ, రంగోలి , విద్యార్థులకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.మెతుకు సీమ ను గెలిపించాలన్నారు.

.