పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్స్ కీలకం

మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): సాధారణ ఎన్నికల నియమావళి అమలులో బాగంగా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్స్ కు రెండవ సారి శిక్షణ కార్యక్రమ సమావేశంను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా , జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ సదర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 30న  పోలింగ్ ఉన్నందున, మెదక్ జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాలలో ఎన్నికల లో మైక్రో అబ్జర్వర్స్  కీలకం అని అన్నారు.

మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్, తాగునీరు, విద్యుత్, టయిలెట్స్ సదుపాయాలు , పోలింగ్ నిర్వహణ , EVM, VVPAT పోలింగ్ ఏజెంట్  ల నియామకం, ఇంక్, ఎన్నికల నిర్వహణ జాగ్రతగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.

మాక్ పోలింగ్, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సంఘటనలకు చోటు లేకుండా చూడాలని, ఎన్నిక ముందు,  ఎన్నికల అనంతరం మైక్రో అబ్జర్వర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలింగ్ రోజు చేయాల్సిన విధుల గురించి వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్ర , మైక్రో అబ్జర్వర్స్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

.