మెదక్ వాసి అబ్దుల్ ఖదీర్ కు డాక్టరేట్

హర్షం వ్యక్తం చేసిన కుటుంబీకులు

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ పట్టణ వాసి అబ్దుల్ ఖదీర్ కు డాక్టరేట్ లభించింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం ఎల్లంకి ఇంజనీరింగ్ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఖదీర్ "ఏ స్టడీ ఆన్ అనలైలీజింగ్ ర్యాంక్ వెయిట్ మేథలజికల్ అప్రోచెస్ టూ ఎగ్జామిన్ ది సైబర్ సెక్యూరిటీ కన్క్రీన్స్ ఆఫ్ బ్లాక్ చైన్స్ ఇన్ క్లూడ్స్ ఏ డిసైస్ ప్రేమ్ ఈ వర్క్" పరిశోధనకు డాక్టరేట్ లభించింది. ఉత్తరప్రదేశ్ లోని  ఫిరోజాబాద్ జిల్లా షికోహబాద్ లోని జేఎస్ యూనివర్సిటీ ఈ డాక్టరేట్  ఇచ్చింది. మెదక్ పట్టణానికి చెందిన అబ్దుల్ ఖదీర్ కు డాక్టరేట్ లభించడం పట్ల అతని కుటింబికులు సంతోషం వ్యక్తం చేశారు. ఎల్లంకి ఇంజనీరింగ్ విద్యా సంస్థల చైర్మన్ సదాశివరెడ్డి డైరెక్టర్ సాంబశివ రెడ్డి,సెక్రటరీ దయాకర్ రెడ్డి, ఆకాడమిక్ డైరెక్టర్ సాయి కిరణ్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జాన్ పాల్ లు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతం లో చదువుకున్న అసిస్టెంట్  ఫ్రొఫెసర్ డాక్టరేట్ పొందటం ఎంతో గర్వకారణమని ఎల్లంకి విద్యా సంస్థల చైర్మన్ సదాశివరెడ్డి కొనియాడారు. ఇలాంటి ప్రతిభ కలిగిన వ్యక్తి తమ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేయడం గర్వంగా ఉందన్నారు.ఖదీర్ భవిష్యత్ లో మరెంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఖదీర్ డాక్టరేట్ పొందటం పట్ల అతని స్నేహితులు,శ్రేయోభిలాషులు ఆనందం వ్యక్తం చేశారు.

.