ఈనెల 30న వేతనంతో కూడిన సెలవు
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): రాష్ట్ర శాసనసభకు ఈనెల 30న పోలింగ్ జరగనున్న సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ మంగళవారం తెలిపారు.
ఈనెల 30న గురువారం అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు, పరిశ్రమలకు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించారని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈనెల 29న కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ స్థానికంగా ఉత్తర్వులు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు,విద్యా సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు నవంబర్ 29 మరియు 30 సెలవు దినంగా కలెక్టర్ పేర్కొన్నారు.
పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల టీమ్ ల కేటాయింపు
ఎన్నికల విధుల్లో భాగంగా పోలింగ్ టీమ్ లను (పిఓ, ఏపిఓ, ఓపిఓలు) మూడవ ర్యాండమైజేషన్
పక్రియ ద్వారా ఎన్నికల పరిశీలకుల సమక్షంలో
పోలింగ్ కేంద్రాలకు కేటాయించినట్లు ఎన్నికల అధికారి శరత్ తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 30వ తేదీన జరిగే పోలింగ్ కు సంబంధించి అవసరమైన పోలింగ్ అధికారులను, సిబ్బంది టీమ్ లను ఐదు నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాలకు కేటా యించినట్లు తెలిపారు. థర్డ్ రాండమైజేషన్ ప్రక్రియ ద్వారా టీమ్స్ కేటాయింపు జనరల్ అబ్జర్వర్ల సమక్షంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఐదు నియోజక వర్గాలలో ప్రత్యేక మహిళా పోలింగ్ కేంద్రాలు, పి.డబ్ల్యూ.డి, యూత్ మేనేజ్మెంట్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అబ్జర్వర్లకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు దీపక్ సింగ్లా, పవన్ కుమార్, నాజీమ్ జై ఖాన్, అదనపు కలెక్టర్ మాధురి, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్ అధికారి విజయ్ కుమార్, బిసి సంక్షేమ అధికారి జగదీశ్ ,ఎన్ఐసి డిఐఓ విద్యాసాగర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
.