రైతు సంక్షేమమే కేసిఆర్ ప్రభుత్వ ధ్యేయం

కేటీఆర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి .....

ఎగుమామిడి వెంకటరమణారెడ్డి

సిరిసిల్ల ఫ్యాక్స్ వైస్ చైర్మన్

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేటీఆర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని వరి ధాన్య కొనుగోలు కేంద్రంలో  రైతులకు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రానున్న రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అందించే సంక్షేమ ఫలాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంక్షేమమే కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయమని ప్రతి ఒక్క రైతు కారు గుర్తుపై ఓటు వేసి కేటీఆర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పెద్దూరు తిరుపతి, జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామా గౌడ్, టౌన్ ప్రధాన కార్యదర్శి నులుగొండ శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు ఎగుర్ల కనకరాజు,మండల యూత్ నాయకులు నేరెళ్ల అనిల్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు తిరునహరి భానుమూర్తి, మామిడాల విజయ్, అంకారపు మహేందర్, గొట్ట గణేష్,   తవుతు శివ, ఉమాశంకర్, బాలు, బిగుళ్ల నస్రిన్ మరియు రైతులు పాల్గొన్నారు

.