కెసిఆర్ కమీషన్ల కక్కుర్తి వల్లే పెట్రోల్ ధరలు పెరిగాయి

అస్సాం సీఎం హేమంత బిష్వా శర్మ 

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): రాష్ట్రంలో కేసీఆర్ కమీషన్ల కక్కుర్తి వల్లనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని అస్సాం సీఎం హేమంత బిష్వా శర్మ ఆరోపించారు. సోమవారం మెదక్ లో బీజేపీ అభ్యర్థి పంజా విజయ్ కుమార్ కు మద్దతుగా స్థానిక రాందాస్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్

నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అస్సాంలో పెట్రోల్ లీటర్ ధర రూ.97 ఉందని, కానీ తెలంగాణాలో మాత్రం రూ.110లకు పెరగడంలో సీఎం కమీషన్ లే కారణం అని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇస్తే ఇక్కడ కూడా పెట్రోల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. మహిళ లోకంపై భారం పడకుండా నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు.

బాలికలకు రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తామని, 20 ఏళ్లలో బాలికకు రూ.20 లక్షలు వస్తాయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎస్సీలు వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారని, వారి వర్గీకరణ కోసం కమిటీ బీసీ వర్గీకరణ చేస్తామని చెప్పారు.

రాష్ట్రంలో వరి ధాన్యం అధికంగా పండించే రైతులు ఉన్నారని, వారికోసం ధాన్యానికి గిట్టుబాటు ధర రూ. 3100 ఇస్తామని హామీ ఇచ్చారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తయ్యాక ప్రభుత్వ ఖర్చులతో ప్రజలను దర్శనం కోసం తీసుకు వెళ్తామని అన్నారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గడ్డం శ్రీనివాస్, పంజా విజయ్, తాళ్ళ పల్లి రాజశేఖర్, నందా రెడ్డీ, కరణంగా పరిణిత, విజయ్, నాయిని ప్రసాద్, జనార్దన్ తదితరులు ఉన్నారు.

.