సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం

6 గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తాం

మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు

తెలంగాణ ప్రభ  ( ఉమ్మడి మెదక్ బ్యూరో): అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యం అవుతుందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పక్కగా అమలు చేస్తామని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. సోమవారం చిన్నశంకంపేట మండలం కొర్విపల్లి, గవ్వలపల్లి, చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ మాట్లాడుతూ.... పదేళ్లలో మెదక్ నియోజకవర్గం ఏమి అభివృద్ధి చేసిందో చెప్పాలని, ప్రతి ఒక్కటి కమీషన్లు తీసుకొని దోచుకున్నారని తెలిపారు. తన సొంత గ్రామంలోని కోనాపూర్ సొసైటీలో ఎమ్మెల్యే భర్త దేవేందర్ రెడ్డి కుంభకోణం, వన దుర్గ మాత సొమ్ము దోచుకున్నాడని అలాంటివారు మెదక్ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పండని ప్రశ్నించారు. దళిత బంధు, బీసీ బంధు, డబల్ బెడ్ రూమ్ అన్ని గ్రామాలలో లబ్దిదారులకు అందించాలని కాని ఎందుకు అందించలేదో తెలపాలని సూచించారు.

అబద్దాల మంత్రి హరీష్ రావు అన్ని అబద్దాలు చెప్పి మెదక్కు అన్యాయం చేస్తున్నాడని కనీసం ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే పెన్షన్లు ఇచ్చారని కాంగ్రెస్ వస్తే కరెంటు, పెన్షన్లు రావని అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వస్తుందని ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ లో కాంగ్రెస్కు మంచిపట్టు ఉందని అలాగే మండలాలలో కూడా ఒకే పట్టుతో చేతు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, మీ పక్షాన నేను పోరాడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఇన్చార్జి యడ్యూరప్ప, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల గోపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్, మాజీ సర్పంచ్ మైనంపల్లి రంగారావు, ఉప సర్పంచ్ జీవన్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జంగర్ల గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి ముత్తిగళ్ళ రామచంద్రం, ఆయా గ్రామాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

.