తెలంగాణలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే

-75 సీట్లతో అధికారంలోకి కాంగ్రెస్ 

ఆరు గ్యారేంటిలు మొదటి కేబినెట్ లోనే అమలు 

తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ ఎక్కడుండేవారు

కాంగ్రెస్ కట్టిన స్కూల్ లోనే కేసీఆర్ చదివారు

ఏఐసిసి పరిశీలకులు  యూపీ వెంకటేష్ 

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): తెలంగాణలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని..75 కు పైగా సీట్లతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ మెదక్ పార్లమెంట్ పరిశీలకులు ,కర్ణాటక ఎమ్మెల్సీ యూపీ వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మెదక్ లో ఏర్పాటుచేసిన విలేకర్లతో మాట్లాడారు.మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలనే నినాదంతో వెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు  ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించి మొదటి కేబినెట్ లోనే  అమలుచేస్తామన్నారు.పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్య, రూ 5 వందలకే గ్యాస్,రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి బృహత్తర పథకాలను కాంగ్రెస్ మేనిఫెస్టో లో పొందుపోర్చమన్నారు.తూచా తప్పకుండా మేనిఫెస్టో అమలు చేస్తామన్నారు.తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కేసీఆర్ ఫ్యామిలీ నమ్మకద్రోహం చేశారని ఆరోపించారు. ఇందిరమ్మ హయాంలోనే మెదక్ పార్లమెంటు పరిధిలో వేలాది పరిశ్రమలు నెలకొల్పామని తెలిపారు.సోనియమ్మ తెలంగాణ ఇవ్వకుంటే  కేసీఆర్ ఎక్కడ ఉండేవారని ప్రశ్నించారు.కేసీఆర్ చదివింది కాంగ్రెస్ కట్టిన స్కూల్ లోనే కేసీఆర్ చదివారన్న విషయాన్ని గుర్తేరుగాలన్నారు.యువ నేత కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండన్ సురేందర్ గౌడ్ మాట్లాడుతూ 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలన లో ఎంతో గోస పడ్డామని ఆవేదన వ్యక్తంచేశారు.బీఆర్ఎస్ కు ఓటేయకుంటే పథకాలు రావని బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పథకాలు యధావిధిగా కొనసాగుతాయని,ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.బీఆర్ఎస్ నేతలు

దళిత బంధు,బిసి బంధు,డబుల్ బెడ్రూం ఇళ్లను అమ్ముకున్నారని  విమర్శించారు.అబద్ధాల హరిశ్ రావ్ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఎద్దేవాచేశారు.మెదక్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరారు.అనంతరం సీనియర్ న్యాయవాది జీవన్ రావ్ లు మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిని ప్రజలు నిలదీస్తున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం మూలంగా మెదక్ నియోజకవర్గంలో ఇంకా 30 శాతం ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వలేదని ఆరోపించారు.నియోజకవర్గంలో రెండు లక్షల మంది ఓటర్లను ఆపలేరన్నారు. 

మెదక్ లో బీఆర్ఎస్ ఓడిపోతుందనే కేటీఆర్ మెదక్ కు రోడ్ షో కు రాలేదని ఆరోపించారు.డిసెంబర్ 3 న రోహిత్ గెలిచి రాజపత్రం అందుకోబోతున్నారని ధీమా వ్యక్తంచేశారు.దేవేందర్ రెడ్డి ది కొనాపూర్ నుంచి ఏడుపాయల దాకా అంతా అవినీతేనని విమర్శించారు.బీఆర్ఎస్ నేతలు డబ్బుతో ఓట్ల ను కొనాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.డబ్బిస్తే తీసుకోండి..ఓటు మాత్రం కాంగ్రెస్ కు వేయాలని కోరారు.

పద్మా దేవేందర్ రెడ్డి కి రాజకీయ సన్యాసం తప్పదని జోస్యం చెప్పారు.రోహిత్ గెలుపు ఖాయమైందని,మెజార్టీ కోసమేపనిచేస్తున్నమన్నారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్రీనివాస్,బొజ్జ పవన్, ఆవారి శేఖర్,మంగ రమేష్ గౌడ్,పట్టణ కాంగ్రెస్ అద్యక్షుడు గూడూరి ఆంజనేయులు గౌడ్, తిమ్మన్నగారి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

.