మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు సతీమణి శివాని రెడ్డి
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తారని మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు సతీమణి శివాని రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ మండల పరిధిలోని మాచవరం గ్రామంలో సర్పంచ్ సంధ్యారాణి శ్రీనివాస్ చౌదరి తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానం సౌమ్యుడు ప్రతిభావంతుడైన డా. మైనంపల్లి రోహిత్ రావు ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిపిందని తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించి మెదక్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలందరికీ రూ.500లకే సిలిండర్ అందిస్తామన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద భూమి ఉన్న రైతులతోపాటు కౌలు రైతులకు ఏడాదికి రూ 5 వేలు అందజేస్తారన్నారు.
