తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): మండల కేంద్రంలోని రామోజీపేట గ్రామానికి చెందిన యువకులు కి ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మానకొండూరు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గెలిపించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసే ఐలయ్య, మానకొండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినయ్,మానకొండూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకట్,గ్రామ శాఖ అధ్యక్షుడు భూమయ్య, మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు , కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు, యువకులు,తదితరులు పాల్గొన్నారు.
.