రాజ్యాంగం గొప్పతనాన్ని తెలుసుకోవాలి:జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్

-IDOC లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

తెలంగాణ ప్రభ, (సిరిసిల్ల): భారత రాజ్యాంగ విలువలను, ప్రాథమిక సూత్రాలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్  అన్నారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం  ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జిల్లా అదనపు కలెక్టర్  భారత రాజ్యాంగ ప్రవేశిక పత్రాన్ని చదివి

జిల్లా అధికారులు, కలెక్టరేట్, పలు ప్రభుత్వ శాఖల  ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.

కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్  మాట్లాడారు. రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. దేశ అభివృద్ధికి రాజ్యాంగం దిక్సూచిలాంటిదని అన్నారు. రాజ్యాంగం గొప్పతనాన్ని భావితరాలకు తెలుపాలని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మి రాజం, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, కలెక్టరేట్ AO రామ్ రెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

.