ఈ నెల 29 వ తేదీ లోగా ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలి

- ఇది వరకే ఫారం -12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం

- సిరిసిల్ల, వేములవాడ తహశీల్దార్  కార్యాలయాలలో పోస్టల్ బ్యాలెట్ వినియోగం కోసం ఫెలిసిటేషన్ సెంటర్  ఏర్పాటు

- కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి 

తెలంగాణ ప్రభ (సిరిసిల్ల): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉండి ఇది వరకే ఫారం -12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న సిబ్బందికి ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అనురాగ్ జయంతి తెలిపారు. 

ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఎన్నికల విధుల్లో ఉండి ఇప్పటి వరకూ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని సిబ్బంది ఈ నెల  29 వ తేదీ వరకూ సిరిసిల్ల, వేములవాడ తహశీల్దార్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెలిసిటేషన్ సెంటర్ లో కార్యాలయాల పని వేళల్లో పోస్టల్ బ్యాలెట్ ను సిబ్బంది వినియోగించుకోవాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు.

.