చేతి గుర్తుపై ఓటు వేసి కేకే మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీ తో గెలిచిద్దాం

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డి పేట):ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ ప్రచారంలో భాగంగా శనివారం గడపగడపకు తిరుగుతూ ప్రచారాన్ని ఉదృతం చేశారు.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆరు గ్యారెంటీలతోపాటు రెండవ  విడతలో పెట్టిన మ్యానిఫెస్టోను వివరిస్తూ  ఓట్లను అభ్యర్థించారు.అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాబోతుందని మీ విలువైన ఓటును హస్తం గుర్తు కు ఓటు వేసి కేకే మహేందర్ రెడ్డి ని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పందిర్ల లింగం గౌడ్,చెన్ని బాబు, గంట అంజాగౌడ్, గుండాడి రామ్ రెడ్డి,  శ్రీపాల్ రెడ్డి, గోపాల్, గుర్రపు రాములు, సంతోష్ గౌడ్,కార్యకర్తలు నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

.