ఆడ బిడ్డ ను ఆశీర్వదించండి:

తెలంగాణ ప్రభ (ఏళ్లరెడ్డిపేట) :ఆడ బిడ్డ ను ఆశీర్వదించండి  అంటూ సిరిసిల్ల భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమదేవి కోరారు.శనివారం  రోడ్డు షో సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం నుండి పాత బస్టాండ్ వరకు కొనసాగింది.రోడ్డు షో సందర్భంగా ‌‌మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు.భాజపా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని రోడ్డు షో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గం లో  కమలం పువ్వు గుర్తు కు ఓటు వేసి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు.మోడి అభివృద్ధి  తో పాటు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందేందుకు భాజపా ను ఆశీర్వదించాలని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆడబిడ్డను గెలిపించాలని కోరారు.రోడ్డు షో లో రాణి రుద్రమ దేవి వెంట భాజపా మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి, నాయకులు చందుపట్ల లక్ష్మారెడ్డి, చందపట్ల రాజిరెడ్డి, మిరియాల్  కార్  రవి, వెంకటాపూర్ ఉపసర్పంచ్ మెడిశెట్టి బాలయ్య, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు కోనేటి సాయన్న, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

.