
-అందుబాటులో ఉంటా
-అడ్లూరి లక్ష్మణ్ కుమార్
తెలంగాణ ప్రభ(ధర్మపురి):ఒక్కసారి ధర్మపురి శాసన సభ్యుడు గా అవకాశం కల్పిస్తే అందుబాటులో ఉంటు సేవ చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శనివారం స్థానిక బ్రాహ్మణ సంఘం లో మహిళల తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
మంత్రి హోదాలో ఉన్న కొప్పుల ఈశ్వర్ ధర్మపురికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని, ఇప్పటివరకు మాజీ మంత్రివర్యులు రత్నాకర్ రావు చేసిన అభివృద్ధి తప్ప ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ చేసిన అభివృద్ధి అంటు ఏమీ లేదని అన్నారు. ధర్మపురి క్షేత్రానికి 500 కోట్ల రూపాయలు ఇస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఏమైందని,పైగా కాంగ్రెస్ నాయకులు చేసిన అభివృద్ధి ఏమి లేదని ముఖ్యమంత్రి చెప్పడం బాధకరమన్నారు.తలాపున గోదావరి ఉన్న ధర్మపురి ప్రాంత ప్రజలకు తాగడానికి నీళ్లందని పరిస్థితి నెలకొందని, ఇప్పటివరకు ధర్మపురిలో ఒక పాలిటెక్నిక్ కళాశాల గాని,ఐటిఐ కళాశాల గాని లేవని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల లోపల ధర్మపురిలో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని, తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని, ధర్మపురిలో ఒక బస్ డిపోను ఏర్పాటు చేస్తామని,కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ధర్మపురి నియోజక ఎమ్మెల్యేగా తనకు ఈ సారి అవకాశం ఇవ్వాలని, హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
.