బీఆర్ఎస్ తోనే సామాజిక న్యాయం : ఎంపీపీ పడిగల మానస రాజు

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); బీఆర్ఎస్ తోనే సామాజిక న్యాయం జరుగుతుందని ఎంపీపీ పడిగల మానస పేర్కొన్నారు. శనివారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీపీ మానస స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి విస్తృత ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటేసి కేటీఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మానస మాట్లాడుతూ... కాంగ్రెస్, బిజెపి చెప్పే ప్రలోభాలను ఎవరు నమ్మొద్దని, గత 9 ఏండ్ల పాలనలో ఎన్నో సంక్షేమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ప్రతి ఒక్కరు ఓటు వెయ్యాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మైనార్టీ మండల నాయకులు, యూత్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

.