ఇందిరమ్మ పాలన రావాలంటే కాంగ్రెస్ కు ఓటెయ్యాలి
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): బకాసురుల పాలనకు స్వస్తి పలికి ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయాలని మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. శనివారం మండల పరిధిలోని పొడ్చెన్ పల్లి తండా, యూసుఫ్ పేట, అరేపల్లి, అర్కెల, తమ్మాయి పల్లి, శేరిపల్లి, మధిరే కొత్తపల్లి, నార్సింగి గ్రామాలలో ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పనులు పడకేసినా పట్టించుకోని ఎమ్మెల్యే ఏ మొఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నారన్నారని. పదేళ్ళు పాలించి మెదక్ నియోజక వర్గాన్ని దోచుకొని, దాచుకున్నది సరిపోలేదా అని ప్రశ్నించారు.
పదేళ్ళ కాలంలో రేషన్ కార్డులు, పేర్లు పొందుపరిచని ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తామంటే ప్రజలు నమ్ముతారా అని నియోజక వర్గానికి ప్రజలకు చేసింది ఏమిటో వివరించి ఓట్లు అడగాలన్నారు.. కమిషన్ల సంపాదనతో కోట్లు కొల్లగొట్టరని
పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కమీషన్ల తెలంగాణ చేశారని.నాణ్యత లేని ప్రాజెక్టులు నిర్మించారని అన్నారు...మాయ మాటలకు మోస పోవద్దని యువకుడిగా తనను ఆదరించి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. మెదక్ ఎమెల్యే పద్మారెడ్డికి గతంలో 5 ఎకరాలు ఉంటే ఈ రోజు వేల ఎకరాలు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. దోచుకొని దాచుకోవడం వాళ్ళ నైజం అన్నారు. కమిషన్ల పాలన వారిది సేవకుల పాలన మాదని, మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి వస్తున్నారని విమర్శించారు. రెండు పర్యాయాలు గెలిపించిన ప్రజలకు చేసింది ఏమిలేదన్నారు. సిద్దిపేటకు ఇచ్చిన ప్రాధాన్యత మెదక్ కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇక పదేళ్ళు పాలించింది చాలు మీ పాలన ఏ స్థాయిలో కొనసాగించారో ప్రజలకు తెలుసన్నారు. పదేళ్ళ కాలంలో తగ్గించని సిలిండర్ ధరను ఇప్పుడు తగ్గిస్తామని గారడీ మాటలను నమ్మెరోజులు లేవని. ప్రజలను మోసం చేస్తూ ప్రజా సొమ్మును అప్పనంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ సందర్భగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురిని కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అద్యక్షులు ప్రభాకర్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు గోవింద్ నాయక్, పాపన్న పేట ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, మండల కోప్షన్ సభ్యులు గౌస్, మాజీ ఎంపీటీసీ రమణ, శ్రీశైలం అప్ప, సాబేర్, కొండల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నారాయణ, మాజీ ఉపసర్పంచ్ అంజయ్య, దుర్గయ్య, షహీద్ పాషా, ఈశ్వరప్ప సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ గౌడ్, రామ గౌడ్, ఎంపీటీసీ రాము గౌడ్, నాగరాజు, అంజి రెడ్డి, ఖాజా, సూఫీతో పాటు వివిధ గ్రామాల కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
.