పోస్టల్ బ్యాలెట్ కోసం ఉపాధ్యాయుల నిరసన

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో):  పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం లేదని ఉపాధ్యాయులు మెదక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద శనివారం ఆందోళన నిర్వహించారు. మెదక్ నియోజక వర్గం పరిధిలో కలిగిన ఉపాధ్యాయులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే వారికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ కల్పిస్తుంది. రెండవ విడత శిక్షణ జరిగిన నియోజకవర్గ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాల్సి ఉంది. కానీ కొంత మందికే పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి మిగితా వారికి ఇవ్వకపోవడంతో పలు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మెదక్ ఆర్డీఓ వద్ద ఆందోళన చేశారు. ప్రతి ఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్ కల్పించాలని కోరారు. అందోల్, నర్సాపూర్, నారాయణ ఖేడ్ పరిధిలో ఎన్నికల విధులు ఉన్న ప్రతి ఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్ కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన మెదక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అందాస్ రాజేశ్వర్ ప్రత్యేక అనుమతి మీద పోస్టల్ బ్యాలెట్ అందని వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అన్ని నియోజక వర్గాల్లో విధులు నిర్వర్తిస్తూ అందరికీ పోస్టల్ బ్యాలెట్ కల్పించాలని డిమాండ్ చేశారు.

.