స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పని చేయాలి

సంగారెడ్డి  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్

తెలంగాణ ప్రభ (ఉమ్మడి మెదక్ బ్యూరో): జిల్లాలో శాంతియుతంగా, సజావుగా ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ పాటుపడాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ కోరారు.

శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎన్నికలకు సంబంధించి(SOP)

 చివరి 72 గంటలలో చేయాల్సిన పనులు, ఆయా అధికారుల బాధ్యతలు, తదితరాలపై జిల్లా ఎస్పీ రూపేష్, జనరల్ అబ్జర్వర్ పవన్ కుమార్ లతో కలిసి  సంబంధిత అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు చివరి 72 గంటలలో చేయాల్సిన ఆయా పనులపై వివరించారు. పోలింగ్ ఏర్పాట్లు, ఎక్కడ ఏ లొకేషన్ లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్న వివరాలను పోలింగ్ సిబ్బందికి తెలియజేయాలన్నారు. పోలింగ్  సిబ్బంది వసతి ఏర్పాట్లకు తగిన చర్యలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రాల లోపల, పరిసరాల శానిటేషన్ బాగుండా లని,అందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. 

అన్ని చెక్ పోస్ట్ ల వద్ద, ట్రక్కులు, లారీలు, లైట్ మోటార్ వెహికల్స్ అన్నింటిని చెక్ చేయాలన్నారు. చివరి మూడు రోజులు అత్యంత పటిష్టమైన నిఘా పెట్టాలన్నారు.

28 సాయంత్రం 5 గంటల నుండి జిల్లాలో అన్ని హోటల్స్, ఫంక్షన్ హాల్స్ చెక్ చేయాలని, జిల్లా వారు తప్ప, బయటి వారు ఎవరు ఉండకూడదని,

ఎలాంటి ఎన్నికల ప్రచారం జరగకూడదన్నారు.

ఈనెల 29న ఎన్నికల మెటీరియల్, ఈవీఎంలు తదితరాల డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్ కు సంబంధించిన ఏర్పాట్లు ముందస్తు ప్రణాళికతో చేసుకోవాలని ఆర్ఓలకు సూచించారు. మైక్రో అబ్జర్వర్సు ,వెబ్ కాస్టింగ్ సిబ్బందికి, పోలీస్ ఫోర్స్ వారికి విడివిడిగా షామియానా ఏర్పాటు చేయాలన్నారు.   

సెక్టోరల్ అధికారులు

ఈవీఎంలను జాగ్రత్తగా తీసుకెళ్లాలని, సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమైనదని, పూర్తిస్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ,

ఏ విధమైన నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. 

 ఎన్నికల కమిషన్ సూచించిన 12 గుర్తింపు కార్డులలో ఏదేని తీసుకువెళ్లి ఓటర్లు ఓటు వేసుకోవచ్చని, అట్టి విషయం అందరికీ అవగాహన కల్పించాలన్నారు. సెక్టోరల్ అధికారులు ఏవి చేయకూడదు, 

ఏవి చేయాలన్నది స్పష్టంగా తెలుసుకుని బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు.

జిల్లా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి పోలీస్ అధికారులు, ఇతర అధికారు

లందరూ టీం గా పనిచేయాలన్నారు.

 పోలింగ్ రోజు చేయాల్సిన పనులపై ఆయా అధికారులు అందరికీ పూర్తి అవగాహన ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించి పోలీస్ సెక్టార్ అధికారి ఒకరు ఉంటారని, పోలీస్ రక్షణ లేకుండా ఎక్కడికి ఈవీఎంలను తీసుకెళ్లకూడదన్నారు. ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి లు చివరి 72 గంటలు చైతన్యవంతంగా పనిచేయాలన్నారు. నవంబర్ 28 సాయంత్రం నుండి ఫామ్ హౌస్లు, విల్లాలు, హోటల్లలో బయటివారు ఎవరు ఉండవద్దని, చివరి 48 గంటలలో ఫేక్ కాల్స్, కంప్లైంట్స్  వచ్చే అవకాశం ఉంటుందని, ఆయా విషయాలపై అప్రమత్తం కావాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, అదనపు ఎస్పి అశోక్, డిఆర్ఓ నగేష్, మున్సిపల్ కమిషనర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారి, డిపిఓ, ఎక్సైజ్, మెప్మా శాఖల అధికారులు, నోడల్ అధికారులు, డీఎస్పీలు, రిటర్నింగ్ అధికారులు, ఎస్ హెచ్ ఓ లు, ఏ ఆర్ ఓ లు, సెక్టోరల్ అధికారులు, డిస్ట్రిబ్యూషన్ ,రిసిప్షన్ కౌంటర్ ఇన్చార్జీలు, ఎంపీ ఓలు, ఎస్ ఎస్ టి, ఎఫ్ ఎస్ టి, వి ఎస్ టి టీమ్స్ హెడ్స్, తదితరులు పాల్గొన్నారు.

.