మైనంపల్లి, పద్మను ఇంటికి పంపిస్తాం
నేటి మోడీ సభను విజయవంతం చేయండి
బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, మెదక్ అభ్యర్థి పంజ విజయ్ కుమార్
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): తెలంగాణ లో అధికారమిస్తే బిసి ని ముఖ్యమంత్రి ని చేస్తామన్న ఏకైక పార్టీ బీజేపీ అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ అన్నారు.శనివారం స్థానిక మాయ గార్డెన్స్ లో విలేకర్లతో మాట్లాడారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేసిందేమీలేదన్నారు.మైనంపల్లి హన్మంత రావ్ ను గెలిపిస్తే పదేండ్లు మెదక్ కు వదిలి పారిపోయి నేడు కొడుకు ను తెచ్చారని విమర్శించారు. బీజేపీ మేనిఫెస్టో ను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు.అనంతరం బీజేపీ అభ్యర్థి పంజా విజయ్ కుమార్ మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో ప్రగతి సాదించాలంటే ప్రజల బాధలు తెలిసినోళ్లు కావాలన్నారు.
మెదక్ అభివృద్ధి జరగాలంటే బీజేపీ కి ఓటేయాలని కోరారు.
బీఆర్ఎస్ మోసపూరిత హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారని ఆరోపించారు. మెదక్ కు సీఎం కేసీఆర్ ఎప్పుడొచ్చిన పాత హామీలే ఇస్తున్నారని,అమలుచేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.మెదక్ లో వైద్య వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు.జడ్పి సమావేశాల్లో పలుమార్లు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ ను ప్రశ్నించడం జరిగిందన్నారు.
మెదక్ కు మెడికల్ కాలేజి రావాలంటే 300 బెడ్ లు ఉండాలని ,మెదక్ లో ఆ పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు అసాధ్యమైన హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.మెదక్ మున్సిపాలిటీ లో డ్రైనేజీ లు,సిసి రోడ్లు లేక అస్తవ్యస్తంగా ఉందన్నారు.పాలకులు మెదక్ పై కపట ప్రేమ చూపుతున్నారని విమర్శించారు.మైనంపల్లి హన్మంత రావు కొర్వి పల్లి లో 100 బెడ్ ల తో హాస్పటల్ నెలకొల్పుతామని చెప్పి ఎందుకు స్థాపించలేదన్నారు.మైనంపల్లి 10 ఏండ్లు మెదక్ ను ఎందుకు వదిలిపెట్టి పోయావని విమర్శించారు.బీజేపీ కి మెదక్ లో అత్యంత ఆదరణ పొందుతుందన్నారు.తాను డబ్బులకు అమ్ముడు పోయానని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని,
ప్రాణత్యాగం చేసుకుంటా కానీ డబ్బులకు లొంగననన్నారు.
బీజేపీ అధికారంలోకి రాగానే ఏడాదిలో ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ ని తెరిపిస్తామన్నారు.317 జీఓ ను సవరణ చేసేలా కృషి చేస్తామన్నారు. మెదక్ ను చార్మినార్ జోన్ లో కలిపేలా కృషిచేస్తామన్నారు.మెదక్ ను
పర్యటకారంగంగా అభివృద్ధి చేస్తామన్నారు.మెదక్ లో బీజేపీ భారీ మెజార్టీ తో గెలువబోతున్నామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో బీజేపీ ఇంఛార్జి ఈశ్వర్ సింగ్ ఠాగూర్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి రాజశేఖర్ జిల్లా అధికార ప్రతినిదులు నందా రెడ్డి,శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు విజయ్,సుధాకర్ రెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ మధు,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి ,మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు వీణ,పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు
.