3 కోట్లు విలువచేసే 635 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్న పోలీసులు

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కింగ్స్ దాబా వద్ద సంగారెడ్డి రూరల్ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానం ఉన్న రెండు బొలెరో వాహనాలను ఆపి తనిఖీ చేయగా ఆ వాహనాలలో 635 కిలోల అక్రమ రవాణా ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్న విషయంపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ సి.హెచ్ రూపేష్ సంగారెడ్డి జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ బీహార్ కు చెందిన శంభూనాథ్ అనే వ్యక్తి 12 సంవత్సరాల క్రితం షాద్ నగర్ మండలం మనోహరాబాద్ ముప్పిరెడ్డిపల్లిలో లేబర్ గా  పనిచేస్తూ ఒక పాన్ షాప్ నిర్వహించేవాడని తెలిపారు.

ఈ క్రమంలో భాగంగా బీహార్ కు చెందిన భూషణ్ అనే వ్యక్తితో శంభూనాథ్ కి పరిచయం ఏర్పడగా భూషణ్ శంభోనాథ్ అనే వ్యక్తిని ఒరిస్సా రాష్ట్రంలోని కొంతమంది గంజాయి సప్లై చేసే స్మగ్లర్లకు  పరిచయం చేశాడు.

అందులో భాగంగా శంభూనాథ్ కు ఒరిస్సాకు చెందిన గంజాయి సప్లై చేస్తే అక్రమ స్మగ్లర్లు డబ్బు ఆశ చూపి అంతర్రాష్ట్ర గంజాయి సప్లై చేస్తే ప్రతి ఒక్క ట్రిప్పుకు ఒక లక్ష రూపాయలు ఇస్తామని డబ్బులు ఆశ చూపారు.

ఈ డబ్బుకు ఆశపడిన శంభూనాథ్ అనే వ్యక్తి డ్రైవర్లు మరియు క్లీనర్ లను నియమించుకొని కొన్ని సినిమా

తరహాలో మాదిరిగా బొలెరో వాహనాలకు నంబర్ ప్లేట్లను మారుస్తూ అలాగే తన డ్రైవర్లకు క్లీనర్లకున్న సెల్ ఫోన్లు మరియు వాటిలోని సిమ్ కార్డును మారుస్తూ అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నాడని ఎస్పీ రూపేష్ అన్నారు. 

 ఎక్కడైనా గంజాయి పండించిన, అమ్మిన, అక్రమ రవాణా చేసిన, సేవించిన అట్టివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే యువత ముఖ్యంగా ఇటువంటి గంజాయి సేవించడంపై అప్రమత్తంగా ఉండి ఇటువంటి నిషేధిత పదార్థాలను సేవించకూడదని కోరారు.

ఇంత పెద్ద మొత్తం చేసుకున్న ఎండు గంజాయి 2023 సంవత్సరంలో ఇదే మొదటిసారి అని ఎన్నికల ముందు ఇంత పెద్ద మొత్తంలో ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు మరియు స్పెషల్ టాస్క్ కోర్స్ వారిని ఎస్పీ రూపేష్ అభినందించారు.

గంజాయిని పట్టుకున్న పోలీసులకు రివార్డులు మరియు ప్రశంసా పత్రాలు ఇస్తామని తెలిపారు.

ఈ విలేకరుల సమావేశంలో సంగారెడ్డి డీఎస్పీ రమేష్ కుమార్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంగారెడ్డి రూరల్ సీఐ సుధీర్ కుమార్, ఎస్సై రాజేష్, పట్టణ సీఐ శ్రీధర్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

.