మెదక్ ప్రజలకు మైనంపల్లి చేసింది శూన్యం

 మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి

 తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): మెదక్ ప్రజలకు మైనంపల్లి హనుమంతరావు చేసింది ఏమీ లేదని పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలంలోని నడిపి తండా, బంటు కుంట తండా, ధర్మా తండా, జంగారాయి తండా, ధర్పల్లి, అగ్రహారం, గవ్వల పల్లి, గెరిల్లా తండా, కొరివిపల్లి

తండాలలో నీ పంచాయతీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మ మాట్లాడుతూ..గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి 13 ఏళ్లు పత్తా లేకుండా పోయారని, ఇప్పుడు తన కొడుకును ఎమ్మెల్యేగా చేయాలని స్వార్థం కోసం మెదక్ వచ్చాడని ఆరోపించారు. మహిళలతో కలసి తాను బతుకమ్మ ఆడితే  అవహేళన చేస్తున్నాడు. తెలంగాణ సాంప్రదాయాలు తెలవని వ్యక్తికి ఓటు వేయాలా... ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి మూడోసారి ఎమ్మెల్యేగా తనను దీవించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రజలకు పిలుపునిచ్చారు. 

మైనంపల్లి మాకు పదవులు వద్దంటారు.. ప్రజాసేవకే అంకితం అంటారు... అలాంటప్పుడు ఎమ్మెల్యే పదవి ఎందుకని, ఎమ్మెల్యేగా నిలబడటం ఏందని ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పట్లోరి మాధవి రాజు, మండల పార్టీ అధ్యక్షుడు రాజు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, టౌన్ అధ్యక్షుడు హేమచంద్రం, సర్పంచ్ పూలపల్లి యాదగిరి యాదవ్, రమేష్, నాయకులు ఏకే గంగాధర్ రావు, ఎంపీటీసీ ఏమ వెంకటేశం, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ్ళరాజు, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బందెల ప్రభాకర్, సత్యనారాయణగౌడ్, శివకుమార్, ప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు.

.