మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి : అడ్లూరి లక్ష్మణ్ కుమార్

-ధర్మపురి లో అభివృద్ధి శూన్యం.

-బస్సు డిపో,రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయలేదు

-ఒక్కసారి అవకాశం ఇవ్వండి

-అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

తెలంగాణ ప్రభ(ధర్మపురి): తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం ధర్మపురి పట్టణంలోని  బోయవాడ, తెనుగువాడ  ప్రధాన కూడలిలో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రచారం చేశారు. అదేవిధంగా వెల్గటూర్ మండలం లోని కొండాపూర్, ఎండపల్లి, అంబర్పేట్,పాత గూడూర్,సూరారం, గుడిసెల పేట, మారేడుపల్లి, ముంజంపల్లి, శానబండ, తదితర గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి ఎమ్మెల్యేగా తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మూడుసార్లు ఓటమిపాలైన నిత్యం ప్రజలను ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. నాలుగు సార్లు కొప్పుల ఈశ్వర్ గెలుపొందిన ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి రత్నాకర్ రావు హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి లేదని పేర్కొన్నారు. కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తమ కార్యకర్తలకు తప్ప అసలైన లబ్ధిదారులకు అందించలేదని తెలిపారు.తాను గెలిస్తే అన్ని వర్గాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవనందిస్తూ అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులకు అందే విధంగా చూస్తానని తెలియజేశారు. ఎన్నిసార్లు ఓటమి పాలైన ప్రజలకు చేయాలని తపనతో పోటీ చేస్తున్నానని ఒక్కసారి ఆశీర్వదించి తనను గెలిపించాలని కోరారు.10 సంవత్సర కాలంగా అధికారంలో ఉన్న రాత్రి 7 దాటితే  ధర్మపురి కి బస్సు సౌకర్యం కల్పించలేదు బస్సు డిపో ఏర్పాటు, చెయ్యలేదు,కోరుట్ల ఎమ్మెల్యే కేవలం ఒక శాసనసభ్యులుగా ఉండి తన నియోజకవర్గంలో కోరుట్ల మెట్పల్లి లకు రెవెన్యూ డివిజన్ సాధించారని కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉండి ధర్మపురికి రెవెన్యూ డివిజన్ తీసుకురావడంలో విఫలమైనారని పేర్కొన్నారు.తాను 4 సార్లు ఓటమి పాలై అన్ని రకాలుగా నష్టపోయిన నిత్యం అందుబాటులో ఉన్ననాని తెలియజేసారు. ఒక్కసారి తనను గెలిపిస్తే ప్రజల రుణం తీర్చుకుంటాని తెలిపారు. రాష్ట్రంలో అన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని తెలిపాయని రాష్ట్రంలో రాబోయేది  కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు

.