తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సత్యసాయి మందిరంలో పుట్టపర్తి సత్యసాయి బాబా 98వ జన్మదిన వేడుకలను సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి భక్తులు భజన సంకీర్తనలతో కేక్ కటింగ్ చేసి వేడుకలను జరుపుకున్నారు. తదనంతరం తీర్థ ప్రసాదాలను అందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు, సత్యసాయి మందిర కన్వీనర్ అంకం వేణు, కో కన్వీనర్ బండి లక్ష్మణ్, వినోద్, శ్రీనివాస్, బాలరాజు, పూర్ణచందర్, మహేష్, ప్రశాంత్ మరియు భక్తులు పాల్గొన్నారు
