కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం
బీజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలనపై సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జీతో విచారణ చేయిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డా అన్నారు. గురువారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో మార్పు కోసం బీజేపీకి ఓటు వేయాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాళేశ్వరం కేటీఆర్ కు ఏటీఎంల మారిందని, అదే విధంగా హైదరాబాద్లో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ధరణి పేర ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తే దానిని తీసివేస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కేసీఆర్ కుటుంబ పాలన సాగించారని, బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని అందులో కేసీఆర్, కేటీఆర్, కవిత, అల్లుడు హరీష్ రావు ఉన్నారన్నారు. అదే విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా మైనార్టీలకు 4 శాతం నుంచి 12 శాతం రిజర్వేషన్లు పెంచుతామన్నారని, మేము వస్తే రిజర్వేషన్లు ఎత్తివేసి ఓబీసీలకు ఇస్తామని ప్రకటించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు గుంజుకోవడానికి ధరణి తెచ్చారన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే అవినీతిపై విచారణ చేయించి కేసీఆర్ ను జైల్లో వేస్తామన్నారు.
మియాపూర్ భూ దందా ప్రభుత్వ భూములలో అవినీతి, వెయ్యి కోట్ల అవినీతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో జరిగిందని ఆరోపించారు. దళిత బంధు ఎవ్వరికైనా లాభం జరిగిందా.. 30శాతం కమీషన్ తీసుకున్నారని, కేసీఆర్ స్వయంగా చెప్పాడని, మా ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్ తీసుకున్నాడన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను కేసీఆర్ ఆపివేశారన్నారు. ప్రధానమంత్రి ఆవాజ్ బీమా యోజన 20లక్షల ఇండ్లు మోడీ శాంక్షన్ చేస్తే దానిని ఇక్కడ కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లుగా మార్చారని, ఎవ్వరికైనా వచ్చిందా అంటూ ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని ముందుకు తీసుకుపోయారని, దేశం ఏకానమీ ప్రపంచంలో 5వ స్థానంలో ఉందన్నారు. మళ్లీ గెలిస్తే మూడవ స్థానానికి తీసుకువస్తామన్నారు.
9 సంవత్సరాల క్రితం మొబైల్ మేడిన్ చైనా ఉంటే ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా ఉందన్నారు.
కేసీఆర్, కాంగ్రెస్ మాటలకు గ్యారెంటీ లేదని, కాంగ్రెస్ సర్కారు వస్తే కర్ణాటకలాగా అవుతుందని, కేసీఆర్ వస్తే కుటుంబ పాలన వస్తుందన్నారు.
పెట్రోల్ పై, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని, రూ.2500 ఇన్ పుట్ సబ్సీడీ రైతులకు ఇస్తాం, పసుపుబోర్డు ఇచ్చాం. మార్కెటింగ్ ప్రాసెసింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యానికి రూ. 10లక్షలు, పేదలకు ఇంటి స్థలం, నిర్మాణానికి సాయం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సభలో బీజేపీ అభ్యర్థులు పులిమామిడి రాజు, సంగప్ప, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి, కొండాపురం జగన్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.