ఎన్నికల అధికారులు వెంటనే స్వాధీనం చేసుకోవాలి
కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండన్ సురేందర్ గౌడ్, న్యాయవాది జీవన్ రావు
పార్టీ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలి
డిప్యూటి ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): తెలంగాణ రాష్ర్ట ఎన్నికల కమీషన్ ఈనెల 9న విడుదల చేసిన లేఖలో ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఎమ్మెల్యే కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు కొనసాగిస్తున్న ఎమ్మెల్యే పద్మా రెడ్డి భర్త దేవేందర్ రెడ్డి నేరుగా పార్టీ వ్యవహారాలు ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంప్ లోనే కొనసాగించడం విడ్డూరకరంగా ఉందని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మెన్ కొండన్ సురేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు న్యాయావాది జీవన్ రావు ఆరోపించారు. ఈ మేరకు జిల్లా డిప్యూటి ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లుకు గురువారం కలెక్టరేట్ లో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరించడం విడ్డూరకరంగా ఉందని అన్నారు. తక్షణమే ప్రభుత్వ క్యాంప్ కార్యాలయం ను తమ ఆధీనంలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల రాజేష్, బొజ్జ పవన్, కౌన్సిలర్ లు దాయర లింగం, అవారి శేకర్, అఫ్జల్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
.