కేటీఆర్ కు మద్దతుగా రెడ్డి సంఘం నాయకుల ప్రచారం

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండలంలోని జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు కూర అంజిరెడ్డి ఆధ్వర్యంలో బి ఆర్ఎస్  పార్టీ అభ్యర్థి కేటీ రామారావు కి మద్దతుగా తంగళ్ళపల్లి మండల కేంద్రంతో పాటుగా మండలంలోని బద్దెనపల్లి, రామన్న పల్లె, బస్వాపూర్ గ్రామాలలో  రెడ్డి కుల బంధువులను కలిసి కెసిఆర్ ప్రభుత్వం రైతాంగానికి చేసినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ అభ్యర్థి కే టి రామారావు  కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ మండలాల రెడ్డి సంఘం అధ్యక్షులు వేసిరెడ్డి రామిరెడ్డి, గడ్డమీద శ్రీకాంత్ రెడ్డి,వెంకట్ రెడ్డి, సిరిసిల్ల టౌన్ అధ్యక్షులు మడుపు విజయభాస్కర్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేపూరి వెంకటరెడ్డి, సిరిసిల్ల ప్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ కంది భాస్కర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, పబ్బతి విజయేందర్ రెడ్డి, దోర్నాల జయరాంరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,రెడ్డి సంఘ నాయకులు పాల్గొన్నారు.

.