బీఆర్ఎస్ కు దడ పుట్టిస్తున్న ఆరు గ్యారంటీలు

మెదక్ లో  కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ సతీమణి శివాని రెడ్డి 

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలతో బీఆర్ఎస్ పార్టీలో దడ పుట్టిస్తుందని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ సతీమణి మైనంపల్లి శివాని రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి, అగ్రహారం, జంగరాయి, గ్రామాలలో చెయ్యి గుర్తుకు ఓటేసి రోహితన్ను గెలిపించాలని కర్రపత్రాలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ప్రజా వ్యతిరేక ఆరోపించారు. మెదక్ నుంచి సిద్దిపేటకు డబ్బుతో కార్యాలయం తరలి పోతుంటే ఎమ్మెల్యే పట్టించుకున్న పాపనపోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ ప్రజలకు సేవ చేయడానికి మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచాడన్నారు.

అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించింది అని, మెదక్ ప్రజల రుణం తీర్చుకునేందుకు మంచి అవకాశం వచ్చిందని ప్రజలు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అధికారంలో లేకున్నప్పటికీ మైనంపల్లి ఆర్గనైజేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల గోపాల్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి శ్రీమాన్ రెడ్డి, ఎంపీపీ ఆవులు భాగ్యలక్ష్మి మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, మైనంపల్లి రంగారావు, ప్రచార కమిటీ మండల కన్వీనర్ బందెల సాయిలు, యాదవ రావు, ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్, గడ్డం నెల్లూరు, వడ్ల శోభ శ్రీనివాస్, హలావత్ మోహన్, తోట వెంకటేశంతో పాటు తదితరులు పాల్గొన్నారు.

.