అవినీతిలో కూరుకుపోయిన ఎమ్మెల్యే పద్మకు ఓటమి తప్పదు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు బొంద పెట్టే సమయం దగ్గర పడిందని మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు విమర్శించారు.
బుదవారం పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లపూర్, మిన్ పూర్, కందిపల్లి, మల్లంపేట, నామపూర్ , గాజుల గూడెం, కొడుపాక, శేరిపల్లీ, పోడ్చెన్ పల్లి తండా, గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పదేళ్ళుగా దోచుకొని దాచుకున్న సొమ్ములతో మభ్యపెట్టేందుకు వస్తున్న నాయకుల సొమ్మును తీసుకొని అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. రేషన్ కార్డులు ఇవ్వని ప్రభుత్వం నేడు సన్నబియ్యం ఇస్తామని మాయ మాటలు చెబుతున్న బీఆర్ఎస్ నాయకుల మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. దళిత బందు, బీసీబందు పథకాలను ఎంత మందికి ఇచ్చారో వివరించాలని తెలిపారు. పదేళ్ళ కాలంలో తగ్గించని సిలిండర్ ధరను ఇప్పుడు తగ్గిస్తామని గారడీ మాటలను నమ్మెరోజులు లేవని. ప్రజలను మోసం చేస్తూ ప్రజల సొమ్ములను దాచుకున్నది దోచుకున్నది సరిపోలేదా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిని ప్రజలు నిలదీస్తుంటే తమ ప్రచారాన్ని కాంగ్రెస్ వాళ్లు అడ్డుకుంటున్నారని చెప్పడం సిగ్గుచేటు అన్నారు.
తాను మాటలు చెప్పే నాయకుణ్ణి కాదని అభివృద్ధి చేసి చూపిస్తానని రోహిత్ రావు స్పష్టం చేశారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే మెదక్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అద్యక్షులు ప్రభాకర్ రెడ్డి, పార్టీ అద్యక్షులు గోవింద్ నాయక్, పిసిసి అధికార ప్రతినిధి శ్రీకాంత్ అప్ప, స్థానిక సర్పంచ్ బాపు రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఆఫీస్ మొల్సాబ్, ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, జనార్ధన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, సతీష్, షహీద్ పాషా, ఈశ్వరప్ప, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
.