అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న
జిల్లా కలెక్టర్ ను తక్షణమే బదిలీ చేయాలి
- ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
- ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు రోహిత్ ను గెలిపిస్తారు
- జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవన్ రావు, కొండన్ సురేందర్ గౌడ్
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం... మార్పు కావాలని జనంలోనే మొదలైందని... అధికార పార్టీ నాయకుల గుండెల్లో వణుకు మొదలైందని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేందర్ గౌడ్, న్యాయవాది జీవన్ రావ్ లు తెలిపారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మంగళవారం రాత్రి తలపెట్టిన విజయశాంతి రోడ్ షో విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటమి భయంతోనే అవినీతి చీకటికి తెరలేపుతున్నారని వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ర్టంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో వణుకు మొదలైందని వారు అన్నారు. ఓటర్లను భయబ్రాంతులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చీకటి కోణాన్ని సృష్టిస్తున్నారని, ఓటర్లు ఎవరు కూడా భయబ్రాంతులకు లోనుకావద్దని వారు తెలిపారు. మెదక్ నియోజక వర్గంలోని పలు మండలాల్లో వెలుగు కార్యాలయ సిబ్బంది పలు గ్రామాల్లో సౌభాగ్య లక్ష్మి పథకం క్రింద దరఖాస్తు చేసుకొని కారు గుర్తుకు ఓటు వేసిన తరువాత సౌభాగ్య లక్ష్మి పథకం వర్తింపజేస్తుందని ఓటర్లను మభ్యపెట్టడం ఎంత వరకు సమంజసమని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ను బదిలి చేయాలి...
మెదక్ జిల్లాలో అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్న జిల్లా కలెక్టర్ ను తక్షణమే బదిలీ చేయాలని బుధవారం జిల్లా ఎన్నికల పరిశీలకులకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాది జీవన్ రావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కు అధికార పార్టీ నాయకులపై ఫిర్యాదు చేసినప్పటికి ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరకరంగా ఉందని అన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ ను బదిలీ చేసి ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు వేసే విధంగా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటు అడిగే నైతిక హక్కు లేకుండా ఉన్న దేవేందర్ రెడ్డి అధికారులను అడ్డుపెట్టుకోని ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎన్ని రకాలుగా చేసినా దేవేందర్ రెడ్డిని ప్రజలు నమ్మెస్థాయిలో లేరని వారు ఆరోపించారు. నీతిమంతుడు అని ప్రకటించుకున్న దేవేందర్ రెడ్డి ప్రజల మధ్యలో ఎందుకు రావడంలేదని వారు ప్రశ్నించారు. అవినీతి కూపంలో పేరుకుపోయిన దేవేందర్ రెడ్డికి ప్రజలు నైతికంగా గుణపాఠం చెపుతారని వారు పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దాయర లింగం, ఆవారి శేఖర్, పవన్ శ్రీకార్, ఉప్పల రాజేష్, బొజ్జ పవన్, చల్లా నరేందర్, గూడూరి క్రిష్ణ, బొద్దుల సంతోష్ లతో పాటు తదితరులు పాల్గోన్నారు.
.